పది పరీక్షలు తెలుగు లేదా ఇంగ్లీష్ లో రాయోచ్చు.! 1 m ago
పదో తరగతి తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు, ఆ మాధ్యమంలోనే పరీక్షలు రాసేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులు కోరడంతో, ఈ ఒక్క సంవత్సరం అనుమతినివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థులు వారి సౌలభ్యానికి అనుగుణంగా తెలుగు లేదా ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఎస్ఎస్‌సీ పబ్లిక్ పరీక్షలకు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసేటపుడు మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవచ్చని, ఒకవేల ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన విద్యార్దులు వారు కావాలంటే ఆప్షన్ ని మార్చుకోవచ్చని సూచించింది. రాష్ట్రంలో మొత్తం పదోతరగతి చదువుతున్న విద్యార్ధులు 6.20 లక్షల మంది ఉండగా ఇప్పటి వరకు ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో నామినల్ రోల్స్‌లో 4.94 లక్షల మంది విద్యార్థుల వివరాలను నమోదు చేశారు. వీరిలో 39 వేలకు పైగా విద్యార్థులు తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాస్తారని తెలిపారు.